మెగాస్టార్ చిరంజీవి గారు డైరెక్టర్ బాబీ కొల్లి డైరెక్షన్లో నటిస్తున్న కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ "వాల్తేరు వీరయ్య". ఇందులో మాస్ రాజా రవితేజ కీరోల్ లో నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది.
తాజాగా వాల్తేరు వీరయ్య టీం కు మెగాస్టార్ చిరంజీవి గారు న్యూ ఇయర్ సందర్భంగా నిన్న గ్రాండ్ పార్టీని ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ మేరకు డైరెక్టర్ బాబీ కొల్లి తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పార్టీ ఫోటో ను షేర్ చేసారు. ఈ పిక్ లో వాల్తేరు వీరయ్యకు పని చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్, ప్రతి ఒక్క నటుడు, చిత్రబృందం ...అందరూ ఉన్నారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
పోతే, ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 13వ తేదీన థియేటర్లకు రాబోతుంది.