సాయి కిరణ్ దర్శకత్వంలో సంగీత, తిరువీర్ నటించిన 'మసూద' సినిమా విడుదలై సినీ ప్రేమికులు మరియు విమర్శకుల నుండి మిశ్రమ స్పందనను అందుకుంది. మసూదా సినిమా విడుదలైన రోజు నుండి అద్భుతమైన స్టార్ట్ ని మొదలుపెట్టింది. ఈ హారర్ చిత్రం యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ఆహా సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ బ్లాక్ బస్టర్ సినిమా డిసెంబర్ 21 నుండి ఆహాలో ప్రసారానికి అందుబాటులోకి వచ్చి ప్రేక్షకుల నుండి అనూహ్య స్పందనను అందుకుంది.
తాజా అప్డేట్ ప్రకారం, జెమినీ టీవీ భారీ మొత్తం చెల్లించి ఈ చిత్రం యొక్క శాటిలైట్ రైట్స్ ని సొంతం చేసుకున్నట్లు సమచారం. ఈ హర్రర్ డ్రామాలో శుభలేక సుధాకర్, అఖిలా రామ్, కావ్య కళ్యాణ్‌రామ్, బాంధవి శ్రీధర్ మరియు ఇతరులు కీలక పాత్రలో నటించారు. రాహుల్ యాదవ్ నక్కా ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందించారు.