ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విడుదల తేదీని ఖరారు చేసిన మెగా హీరో తదుపరి చిత్రం

cinema |  Suryaa Desk  | Published : Mon, Jan 02, 2023, 08:43 PM

"ఉప్పెన" సినిమాతో హీరోగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ తన నటనతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. తాజగా ఇప్పుడు తన 4వ ప్రాజెక్ట్ ని ఇటీవలే నూతన దర్శకుడు శ్రీకాంత్‌తో చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాకి టెంపరరీగా 'PVT04' అనే టైటిల్ ని పెట్టారు. ఈ చిత్రంలో ధమాకా ఫేమ్ శ్రీలీల కథానాయికగా నటిస్తుంది.


తాజాగా ఈరోజు, మూవీ మేకర్స్ ఈ సినిమాని  ఏప్రిల్ 29, 2023న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రం మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందని, వైష్ణవ్ తేజ్ డైనమిక్ మోడ్ లో కనిపిస్తారని మూవీ మేకర్స్ వెల్లడించారు.


నవీన్ నూలి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి డడ్లీ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, ఎస్‌ సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com