క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ "హరి హర వీర మల్లు" సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసందే. ఈ చిత్రం పీరియాడిక్ యాక్షన్ డ్రామా ట్రాక్ లో భారీ స్థాయిలో మౌంట్ చేయబడుతోంది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం మార్చి 30, 2023న విడుదల కానుంది.
తాజాగా ఇప్పుడు, హరి హర వీర మల్లు నిర్మాత AM రత్నం ఈ పాన్-ఇండియన్ మూవీ టీజర్ జనవరి 26, 2023న విడుదల కానుందని వెల్లడించారు. త్వరలోనే ఈ విషయం గురించి మూవీ మేకర్స్ నుండి అధికారిక ప్రకటన రానుంది.
ఈ సినిమాలో బాబీ డియోల్, అర్జున్ రాంపాల్, సిజ్లింగ్ బ్యూటీ నోరా ఫతేహి ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ పాన్-ఇండియా మూవీని మెగా సూర్య ప్రొడక్షన్ నిర్మిస్తుండగా, ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.