కోమలి ఫేమ్ దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన 'లవ్ టుడే' సినిమా తమిళనాడు బాక్సాఫీస్ వద్ద విడుదలైన అనతికాలంలోనే 70 కోట్ల మార్క్‌ను దాటింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ తెలుగు-డబ్బింగ్ వెర్షన్ నవంబర్ 18, 2022న గ్రాండ్ గా విడుదల చేయగా ఈ రొమాంటిక్ కామెడీ తెలుగుబాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. రొమాంటిక్ కామెడీ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమాలో ప్రదీప్ రంగనాథన్ సరసన ఇవానా జంటగా నటించారు. సత్యరాజ్, రాధికా శరత్‌కుమార్, యోగి బాబు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాని నిర్మించింది.
ప్రముఖ నిర్మాత బోనీకపూర్ ఈ సినిమా రీమేక్ రైట్స్ ని కొనుగోలు చేశారని, బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్‌తో ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నట్లు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రూమర్స్ ని క్లియర్ చేయడానికి, తునివు నిర్మాత ట్విట్టర్ లో లవ్ టుడేని హిందీలో రీమేక్ చేయడం లేదని స్పష్టం చేశారు. దయచేసి నేను లవ్ టుడే రీమేక్ రైట్స్ ని పొందలేదని గమనించండి. సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి రిపోర్టులన్నీ నిరాధారమైనవి మరియు నకిలీవి అని బోనీ కపూర్ వెల్లడించారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.