పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నుండి రాబోతున్న సైంటిఫిక్ యాక్షన్ ఎంటర్టైనర్ "ప్రాజెక్ట్ కే". 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్లో, సీనియర్ నిర్మాత నాగ్ అశ్విన్ నిర్మాణసారధ్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ అందం దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తుంది. బిగ్ బి అమితాబ్ బచ్చన్, దిశాపటాని కీరోల్స్ లో నటిస్తున్నారు.
న్యూ ఇయర్ కానుకగా ఈ సినిమా నుండి చిన్న BTS వీడియో ఒకటి విడుదలై, డార్లింగ్ ఫ్యాన్స్ ను ఆశ్చర్యంలో ముంచెత్తింది. లేటెస్ట్ బజ్ ప్రకారం, ఇంతటి భారీ, ప్రతిష్టాత్మక సినిమా యొక్క నైజాం హక్కులు 70కోట్ల భారీ ధరకు అమ్ముడయ్యాయని తెలుస్తుంది. మరి, ఇంత భారీ ధర చెల్లించి ప్రాజెక్ట్ కే నైజాం హక్కులను కొనుగోలు చేసిందెవరు? అన్న విషయం బయటకు రాలేదు.