సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రంల కలయికలో దాదాపు పుష్కరకాలం తదుపరి సినిమా రాబోతుండడంతో ఆడియన్స్ లో అంచనాలు పీక్ స్టేజ్ లో ఉన్నాయి. దీంతో ఈ మూవీ అప్డేట్స్ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం, జనవరి 17వ తేదీ నుండి అంటే సంక్రాంతి పండగ అలా ముగుస్తుందో లేదో ఇలా.. SSMB 28 షూటింగ్ స్టార్ట్ కానుందని తెలుస్తుంది. ఆల్రెడీ ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ గా మంచి యాక్షన్ సీక్వెన్స్ ను పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.
పోతే, ఈ సినిమాలో మహేష్ కు జోడిగా బుట్టబొమ్మ పూజాహెగ్డే నటిస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.