టీ20 ప్రపంచకప్ 2026 నుంచి శ్రీలంక జట్టు నిష్క్రమించింది. సూపర్ 8 చివరి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో హోరాహోరీగా పోరాడి ఓటమి పాలవడంతో టోర్నీ నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో, తమ వైఫల్యానికి కీలక ఆటగాళ్ల గాయాలే ప్రధాన కారణమని శ్రీలంక కెప్టెన్ దాసున్ షనక ఆవేదన వ్యక్తం చేశాడు. అభిమానులను నిరాశపరిచినందుకు క్షమాపణలు కోరాడు.శనివారం క్యాండీలోని పల్లెకెలె స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ నిర్దేశించిన 212 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక చివరి వరకు పోరాడింది. కెప్టెన్ షనక 76 పరుగులతో అజేయంగా నిలిచి వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. అయితే, జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు. చివరికి శ్రీలంక 207 పరుగులకే పరిమితమై 5 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. ఈ ఓటమితో శ్రీలంకతో పాటు మెరుగైన నెట్ రన్‌రేట్ లేని కారణంగా పాకిస్థాన్ కూడా టోర్నీ నుంచి నిష్క్రమించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa