ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్

cinema |  Suryaa Desk  | Published : Fri, Jan 11, 2019, 02:15 PM

సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్.. మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ మొదటిసారి కలిసి నటించిన మల్టిస్టారర్ మూవీ 'F2'.  అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించాడు.  జనవరి 12 న.. అంటే రేపే ఈ సినిమా విడుదల కానుంది.

ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ బిజినెస్ భారీగానే జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు హక్కులు రూ. 34 కోట్ల రూపాయలకు అమ్ముడుపోవడం విశేషం.  వెంకటేష్.. వరుణ్ తేజ్ కెరీర్లలో ఇది హయ్యెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ కావడం విశేషం. ఈ సినిమాను దిల్ రాజు సినిమాలు రిలీజ్ చేసే రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్లే తీసుకున్నారని.. దాదాపు అందరూ అడ్వాన్సు బేసిస్ లోనే ఈ సినిమా హక్కులను తీసుకున్నట్టు ట్రేడ్ వర్గాల నుండి సమాచారం అందుతోంది.

ప్రపంచవ్యాప్తంగా ఏరియా వైజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇలా ఉన్నాయి.

నైజాం: 9 cr
సీడెడ్: 5 cr
ఆంధ్ర: 14 cr

టోటల్: రూ. 28 cr (ఏపీ+ తెలంగాణా)


రెస్ట్ ఆఫ్ ఇండియా: 2.25


ఓవర్సీస్: 4.25

వరల్డ్ వైడ్ టోటల్: రూ. 34.50 cr. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa