నంద కిషోర్ అబ్బురు దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరంతో సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'వినరో భాగ్యము విష్ణు కథ' అనే టైటిల్ ని మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమాలో కిరణ్ సరసన కాశ్మీరా పరదేశి జంటగా నటించింది. ఈ విలేజ్ డ్రామా చిత్రం ఫిబ్రవరి 17, 2023న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజగా ఇప్పుడు, ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ప్రముఖ ఓటిటి ప్లాట్ఫారం ఆహా సొంతం చేసుకున్నట్లు సమాచారం.
ఈ చిత్రంలో కిరణ్ విష్ణు పాత్రలో నటిస్తున్నారు. మురళీ శర్మ, ప్రవీణ్, శుభలేఖ సుధాకర్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి చేతన్ భరద్వాజ్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa