టిక్ టాక్ వీడియోస్, యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్, ప్రైవేట్ సాంగ్స్ తో సోషల్ మీడియా సంచలనంగా ఎదిగిన వైష్ణవి చైతన్య 'బేబీ' సినిమాతో హీరోయిన్ గా డిబట్ ఎంట్రీ ఇవ్వనుంది. అంతకుముందు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'అల వైకుంఠపురంలో' సినిమాతో సినీరంగప్రవేశం చేసింది. ఆపై వలిమై, వరుడు కావలెను సినిమాలలో కూడా నటించింది.
బేబీ టీం తో వైష్ణవి చైతన్య తన పుట్టినరోజును జరుపుకున్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. జనవరి 4న అంటే మొన్న వైష్ణవి పుట్టినరోజు జరగ్గా, ఆమె పుట్టినరోజు కానుకగా బేబీ చిత్రబృందం స్పెషల్ పోస్టర్ ను కూడా విడుదల చేసింది.
సోషల్ మీడియాలో ఎనలేని క్రేజ్ ను సొంతం చేసుకున్న ఈ బ్యూటీ సిల్వర్ స్క్రీన్ పై కూడా గ్రాండ్ సక్సెస్ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.