దిగ్గజ ఫిలిం మేకర్ రాజమౌళి తాను సృష్టించిన అద్భుతమైన దృశ్యకావ్యం "RRR" కు గానూ వెస్ట్రన్ దేశాల నుండి విశేష ప్రశంసలను అందుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు ప్రఖ్యాత హాలీవుడ్ అవార్డులను అందుకుని, మరికొన్ని ప్రఖ్యాత హాలీవుడ్ అవార్డుల నామినేషన్స్ ను దక్కించుకున్న రాజమౌళి వెరీరీసెంట్గానే NYFCC (న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్) బెస్ట్ డైరెక్టర్ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులు ఆయనకు బెస్ట్ విషెస్ ను తెలియచేస్తున్నారు.
మెగాపవర్ స్టార్ రాంచరణ్ కూడా రాజమౌళికి బెస్ట్ విషెస్ ను తెలియచేస్తూ ట్వీట్ చేసారు. ఇలాంటి అవార్డులను ఇంకెన్నో రాజమౌళి అందుకోవాలని కోరుకుంటూ, కంగ్రాట్యులేషన్స్ తెలిపారు.