టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరోగా అశేష ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకున్న హీరో శర్వానంద్. టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో మాత్రమే కాదు టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కూడా.
తాజా బజ్ ప్రకారం, ఒక NRI తెలుగమ్మాయిని శర్వా పెళ్లి చేసుకోబోతున్నాడు. అదికూడా ఈ వేసవి కాలంలోనే అని జోరుగా ప్రచారం జరుగుతుంది. అంతకన్నా ముందుగా ఈ నెల 26న తన ఇష్టసఖితో శర్వా ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నారట. మరి, అదేరోజున శర్వా నుండి అఫీషియల్ గుడ్ న్యూస్ రాబోతుందని తెలుస్తుంది.