ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమాలలో నటసింహం నందమూరి బాలకృష్ణగారి 'వీరసింహారెడ్డి', మెగాస్టార్ చిరంజీవి గారి 'వాల్తేరు వీరయ్య' సినిమాలు ఓవర్సీస్ లో ముఖ్యంగా USA ప్రీ సేల్స్ లో జోరు చూపిస్తున్నాయి.
USA ప్రీ సేల్స్ లో ఇప్పటికే వీరసింహారెడ్డి 150 కే మార్క్ ను క్రాస్ చేసి 200కే డాలర్స్ మార్క్ దిశగా దూసుకుపోతుంటే, తాజాగా వాల్తేరు వీరయ్య 150 కే డాలర్ మార్క్ ను చేరుకున్నట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని తెలుపుతూ, USA లోని అన్ని మేజర్ థియేటర్లలో వాల్తేరు వీరయ్య బుకింగ్స్ ఓపెన్ అయ్యాయని పేర్కొంటూ మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు.
పోతే, జనవరి 13న వాల్తేరు వీరయ్య ఇండియాలో విడుదల కావడానికి రెడీ అవుతుండగా, ఓవర్సీస్ లో ఒకరోజు ముందుగానే అంటే జనవరి 12నే ప్రీమియర్స్ జరుపుకోనుంది.
![]() |
![]() |