ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందినట్లు ట్రంప్ ప్రకటన

international |  Suryaa Desk  | Published : Sun, Mar 01, 2026, 08:02 AM

ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ మరణించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. శనివారం అమెరికా, ఇజ్రాయెల్ దళాలు సంయుక్తంగా జరిపిన సైనిక దాడిలో ఖమేనీ హతమైనట్లు ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' ఖాతాలో వెల్లడించారు. చరిత్రలోనే అత్యంత క్రూరుడైన ఖమేనీ మరణించాడు. ఇది ప్రపంచవ్యాప్తంగా అతడి వల్ల ప్రాణాలు కోల్పోయిన వారందరికీ దక్కిన న్యాయం అని పేర్కొన్నారు.టెహ్రాన్‌లోని ఖమేనీ అధికారిక నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని దాదాపు 30 శక్తిమంతమైన బాంబులతో దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో ఖమేనీ ఓ భూగర్భ బంకర్‌లో ఉన్నప్పటికీ, అత్యాధునిక అమెరికన్ ట్రాకింగ్ సిస్టమ్స్ నుంచి తప్పించుకోలేకపోయారని సమాచారం. ఈ దాడిలో ఖమేనీ నివాసం పూర్తిగా ధ్వంసమైనట్లు న్యూయార్క్ టైమ్స్ విడుదల చేసిన శాటిలైట్ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి.ఖమేనీ మరణవార్తపై ఇరాన్ ప్రభుత్వం స్పందించింది. ఆయన మరణవార్తను ధ్రువీకరించింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో మరణించినట్టు స్పష్టం చేసింది. ఖమేనీ మృతికి సంతాపంగా 40 రోజుల సంతాప దినాలను ప్రకటించింది. ఈ దాడుల నేపథ్యంలో ఇరాన్ కూడా ప్రతిదాడులకు దిగడంతో బహ్రెయిన్, ఖతార్, సౌదీ అరేబియా వంటి గల్ఫ్ దేశాల్లో హై అలర్ట్ ప్రకటించారు.దాదాపు 36 ఏళ్లుగా ఇరాన్‌ను శాసిస్తున్న ఖమేనీ శకం ముగిసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఇరాన్ ప్రజలు తమ దేశాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఇదే సరైన సమయం అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా ఇరాన్ ప్రజలకు, తమకు శత్రువు అక్కడి ప్రభుత్వమేనని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa