ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ సహా,,,,పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు ఏ బ్యాంకుల్లో ఎలా

business |  Suryaa Desk  | Published : Sat, Feb 28, 2026, 10:48 PM

ఒకప్పటితో పోలిస్తే బ్యాంకుల్లో లోన్లు తీసుకునే వారి సంఖ్య విపరీతంగా పెరిగిందని చెప్పొచ్చు. అవసరాలు పెరిగిపోవడం వల్ల చాలా మంది నగదు అవసరాల కోసం లోన్లు తీసుకోవాలని చూస్తున్నారు. బ్యాంకులు కూడా ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు కాస్త తొందరగానే లోన్లు ఇస్తున్నాయి. డాక్యుమెంటేషన్ కూడా తగ్గడంతో క్షణాల్లో, గంటల్లోనే అకౌంట్లో డబ్బులు జమవుతున్నాయని చెప్పొచ్చు. ఇక పర్సనల్ లోన్ అనేది అన్ సెక్యుర్డ్ లోన్. ఇక్కడ ఎలాంటి పూచీకత్తు లేకుండా బ్యాంకులు లోన్ ఇస్తాయి. కాబట్టి.. ఇతర హోం లోన్, వెహికిల్ లోన్, గోల్డ్ లోన్ కంటే వడ్డీ రేట్లు ఇందులోనే ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఇవి బ్యాంకుల్ని బట్టి మారుతుంటాయని తెలుసుకోవాలి. అంటే ఒక్కో బ్యాంకులో వడ్డీ రేట్లు ఒక్కోలా ఉంటాయన్నమాట.


>> వడ్డీ రేట్లలో కాస్త హెచ్చుతగ్గులున్నా చెల్లించాల్సిన ఈఎంఐలో కూడా గణనీయమైన మార్పులు వస్తాయని చెప్పొచ్చు. 20 బేసిస్ పాయింట్లు లేదా 50 బేసిస్ పాయింట్లు వడ్డీ రేటు తగ్గినా దీర్ఘకాలంలో చెల్లించాల్సిన వడ్డీని కూడా భారీగా తగ్గించుకోవచ్చని చెప్పొచ్చు. ఇంకా స్థిర ఆదాయం, సిబిల్ స్కోరు 750 ఆపైన ఉంటే చాలా తక్కువ వడ్డీకే లోన్ వస్తుంది. ఆన్‌లైన్‌లో కూడా ఈ పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.


బ్యాంకులు ఇంకా కొన్ని సార్లు పరిమిత కాలానికి రెగ్యులర్ కంటే తక్కువ వడ్డీకే పర్సనల్ లోన్ ఆఫర్ చేస్తుంటాయి. ఇలాంటి సమయంలో ప్రాసెసింగ్ ఫీజు సహా ఇతర ఛార్జీల్ని కూడా తగ్గిస్తుంటాయి. ప్రముఖ సంస్థల్లో పని చేసే వారికి.. తక్కువ వడ్డీ రేటుకు, వేగంగా లోన్ ఇచ్చేందుకు కూడా ఇష్టపడుతుంటాయి. ఇప్పుడు టాప్ బ్యాంకుల్లో ప్రస్తుతం పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు , ప్రాసెసింగ్ రుసుముల గురించి చూద్దాం.


ముందుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పర్సనల్ లోన్ వడ్డీ రేటు కనీసం 10.05 శాతం నుంచి ప్రారంభమవుతుంది. ఇక్కడ ప్రాసెసింగ్ ఫీజు లోన్ మొత్తంలో 1.5 శాతం వరకు ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో పర్సనల్ లోన్ వడ్డీ రేటు 9.99 శాతం నుంచి ప్రారంభమవుతుండగా ప్రాసిసెంగ్ ఫీజు రూ. 6500 గా ఉంది. ఐసీఐసీఐ బ్యాంకులోనూ వడ్డీ రేటు ఇంతే శాతం నుంచి ప్రారంభమవుతుంది. ప్రాసెసింగ్ ఫీజు లోన్ మొత్తంలో 2 శాతం వరకు ఉంది. యాక్సిస్ బ్యాంకులో 9.50 శాతం నుంచే మొదలవుతుండగా.. ప్రాసెసింగ్ ఫీజు 2 శాతంగా ఉంది. పంజాబ్ నేషనల్ బ్యాంకులో చూస్తే 10.25 శాతంగా వడ్డీ రేటు ఉండగా.. ఒక శాతం వరకు ప్రాసెసింగ్ ఫీజు ఉంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో చాలా తక్కువగా 8.75 శాతం నుంచే వడ్డీ రేటు అమల్లో ఉండగా ప్రాసెసింగ్ రుసుము ఒక శాతం వరకు ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa