మేజర్,హిట్ 2 వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తదుపరి యంగ్ హీరో అడివిశేష్ నుండి రాబోతున్న సరికొత్త చిత్రం "G2"(గూఢచారి 2). కొత్తదర్శకుడు వినయ్ కుమార్ సిరిగినీడి డైరెక్షన్లో ఎపిక్ యాక్షన్ అడ్వెంచర్ గా రూపొందబోతున్న ఈ సినిమా ఎలా ఉండబోతోందనే విషయంపై ప్రేక్షకులకు ఒక క్లారిటీ ఇస్తూ ఈ రోజు సాయంత్రం 04:05 నిమిషాలకు ఒక ప్రీ విజన్ వీడియోను విడుదల చెయ్యబోతుంది జి 2 చిత్రబృందం. శేష్ గతచిత్రాలు సూపర్ హిట్ అవ్వడంతో జి 2 మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.
అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, AK ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమా యొక్క ప్రీ విజన్ వీడియో లాంచ్ ఈవెంట్ ఈరోజు ముంబైలో, రేపు హైదరాబాద్ లో జరగబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa