వినోద్ కుమార్ డైరెక్షన్ లో తమిళ స్టార్ హీరో విశాల్ నటించిన యాక్షన్ డ్రామా 'లాఠీ' డిసెంబర్ 22, 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద డిసాస్టర్ గా నిలిచింది. తాజాగా ఈ సినిమా జనవరి 14, 2023న సన్ NXTలో డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది.
ఈ సినిమాలో సునైనా, ప్రభు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు. రానా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రమణ అండ్ నందా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
![]() |
![]() |