కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, సంయుక్తా మీనన్ జంటగా, డైరెక్టర్ వెంకీ అట్లూరి రూపొందిస్తున్న లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ "సార్". తమిళంలో "వాతి".
తాజాగా ఈ సినిమా నుండి సెకండ్ సింగిల్ "బంజారా" లిరికల్ వీడియో విడుదలైంది. జీవీ ప్రకాష్ కుమార్ స్వరపరిచిన ఈ పాటను స్టార్ సింగర్ అనురాగ్ కులకర్ణి ఆలపించగా, సుద్దాల అశోక్ తేజ సాహిత్యం అందించారు.
తెలుగు, తమిళ భాషలలో ఏకకాలంలో రూపొందుతున్న ఈ సినిమా నుండి గతంలో ఫస్ట్ లిరికల్ సాంగ్ 'మాస్టారూ/ వా వా వాతి' విడుదలై శ్రోతలను విపరీతంగా మెప్పిస్తున్న విషయం తెలిసిందే. నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే నెల 17న తెలుగు, తమిళ భాషలలో విడుదల కావడానికి రెడీ అవుతుంది.