పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో "సలార్" మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. గతేడాది నుండి షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా మరొక 30-35 రోజుల షూటింగ్ ను జరుపుకుంటే ఆల్మోస్ట్ షూటింగ్ ను ఫినిష్ చేసుకున్నట్టే నంట. మరో రెండ్రోజుల్లో సలార్ న్యూ షెడ్యూల్ ప్రారంభం కాబోతుందంట. అందులో ప్రభాస్ పాల్గొంటారట. ఈ షెడ్యూల్ తోనే సలార్ మేజర్ షూటింగ్ పార్ట్ పూర్తవుతుందని టాక్.
శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్, విలక్షణ నటుడు జగపతి బాబు కీరోల్స్ లో నటిస్తున్నారు. రవి బసృర్ సంగీతం అందిస్తున్నారు. విజయ్ కిరంగదుర్ నిర్మిస్తున్నారు.