ఈ నెల 20 నుండి జీ 5 ఓటిటిలో స్ట్రీమింగ్ కి రాబోతున్న యాక్షన్ ప్యాక్డ్ వెబ్ సిరీస్ 'ATM' నుండి మేకర్స్ 'హర్ష' పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ ఆయన క్యారెక్టర్ పోస్టర్ విడుదల చేసారు. బ్యాంకాక్ లో బొండాలు అమ్ముకుంటాడంట కానీ, పైసల్ తో ఆటలో మాత్రం రఫ్ ఆడించేస్తాడు.. అని పేర్కొంటూ ఈ పాత్ర పరిచయం జరిగింది. హర్ష పాత్రను రాయల్ శ్రీ పోషిస్తున్నారు.
చంద్రమోహన్ డైరెక్షన్లో దోపిడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్ లో వీజే సన్నీ, సుబ్బరాజ్, దివి, రవిరాజ్, కృష్ణ బురుగుల ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మిస్తున్నారు. ప్రశాంత్ R విహారి సంగీతం అందిస్తున్నారు.