మాటల మాంత్రికుడు త్రివిక్రం డైరెక్షన్లో సూపర్ స్టార్ మహేష్ బాబు గారు నటిస్తున్న న్యూ మూవీ "SSMB 28" యొక్క న్యూ షెడ్యూల్ రేపటి నుండి ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. ఫైట్ మాస్టర్స్ రామ్ - లక్ష్మణ్ నేతృత్వంలో పవర్ ప్యాక్డ్ యాక్షన్ సీక్వెన్సెస్ చిత్రీకరణ ఈ షెడ్యూల్ లో జరగనుంది.
తాజా అధికారిక సమాచారం మేరకు, SSMB 28 పోస్ట్ థియేట్రికల్ రిలీజ్ ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో ఉంటుందని తెలుస్తుంది. ఈ మేరకు నెట్ ఫ్లిక్స్ సంస్థ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసింది. మేకర్స్ కి భారీ సొమ్మును చెల్లించి మరీ నెట్ ఫ్లిక్స్ ఈ మూవీ డిజిటల్ హక్కులను సొంతం చేసుకోవడం విశేషం.