సందీప్ కిషన్ హీరోగా, విలక్షణ నటుడు విజయ్ సేతుపతి విలన్గా నటిస్తున్న చిత్రం "మైఖేల్". దివ్యాన్ష కౌశిక్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను రంజిత్ జయకోడి డైరెక్ట్ చేస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో గౌతమ్ వాసుదేవ్ మీనన్, అనసూయా భరద్వాజ్, అయ్యప్ప శర్మ, వరలక్ష్మి శరత్ కుమార్, వరుణ్ సందేశ్ కీరోల్స్ లో నటిస్తున్నారు.
వచ్చే నెల మూడవ తేదీన పాన్ ఇండియా భాషల్లో విడుదల కావడానికి రెడీ అవుతున్న ఈ సినిమా నుండి ఈ రోజు ఉదయం ట్రైలర్ విడుదలైంది. నటసింహం నందమూరి బాలకృష్ణ గారు మైఖేల్ ట్రైలర్ ను విడుదల చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలను తెలియచేసారు. పోతే, మైఖేల్ ట్రైలర్ ను తమిళంలో జయం రవి, అనిరుద్ రవిచంద్రన్, మలయాళంలో నివిన్ పౌలీ విడుదల చేసారు.