బాలీవుడ్ లవర్ బాయ్ రణ్ బీర్ కపూర్ ప్రస్తుతం లవ్ రంజన్ డైరెక్షన్లో ఒక సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. రణ్ బీర్ - శ్రద్ధ కాంబోలో రాబోతున్న ఫస్ట్ మూవీ ఇదే. అలానే వీరిద్దరూ కలిసి డైరెక్టర్ లవ్ రంజన్ తో పని చెయ్యడం కూడా ఇదే ఫస్ట్ టైం.
కాసేపటి క్రితమే ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. ప్రేమించే ముందే కంపాటబిలిటీ చూసుకోవాలని, లేకుంటే మనం రిలేషన్ షిప్స్ రూపంలో చేసే ఇన్వెస్ట్మెంట్స్ ప్రేమలో రిస్క్ లను లాభంగా తీసుకొస్తుందనే పాయింట్ తో రూపొందిన ఈ మూవీ ట్రైలర్ ఆధ్యంతం ఎంటర్టైనింగ్ గా సాగింది. మొత్తానికి ట్రైలర్.. ఒక పర్ఫెక్ట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా TJMM సినిమా మనముందుకు రాబోతుందని తెలియచేస్తుంది.
పోతే, హోలీ సందర్భంగా మార్చి 8వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతుంది.