టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ గారి ల్యాండ్ మార్క్ మూవీ 'వెంకీ 75' అధికారిక ప్రకటన నిన్న జరిగిన విషయం తెలిసిందే. హిట్ ఫేమ్ శైలేష్ కొలను డైరెక్షన్లో అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ మూవీ నుండి ఫస్ట్ గ్లిమ్స్ ను రేపు ఉదయం 11:07 నిమిషాలకు విడుదల చెయ్యబోతున్నట్టు కాసేపటి క్రితమే మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు.
క్లాసిక్ హిట్ 'శ్యామ్ సింగరాయ్' తదుపరి నిహారిక ఎంటర్టైన్మెంట్స్ సంస్థలో సెకండ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా రూపొందుతున్న ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.