అమృత అయ్యర్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె తెలుగు సినిమాలతో పటు, మలయాళం, తమిళం మరియు కన్నడ సినిమాల్లో నటించింది.యాంకర్ ప్రదీప్ హీరోగా తెరకెక్కిన '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' సినిమాతో తెలుగుతెరకు పరిచయమైనా "అమృత అయ్యర్". ప్రస్తుతం ఈమె ‘హనుమాన్’ సినిమాలో నటిస్తున్నది. తాజాగా ఈమె సోషల్ మీడియాలో పోస్టు చేసిన మోడ్రన్ ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి.అమృత అయ్యర్ కర్ణాటక రాష్ట్రం, బెంగూళూరులో 14 మే 1994న జన్మించింది. ఆమె బెంగూళూరులోని సెయింట్ జోసఫ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ లో బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ పూర్తి చేసింది.