బాలీవుడ్ సీనియర్ హీరో అజయ్ దేవగణ్, టబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం "భోళా". కోలీవుడ్ బ్లాక్ బస్టర్ "ఖైదీ" కి ఈ సినిమా అఫీషియల్ హిందీ రీమేక్. అజయ్ దేవగణ్ ఈ సినిమాకు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.
కాసేపటి క్రితమే భోళా చిత్రబృందం సినిమా నుండి సెకండ్ టీజర్ ను విడుదల చేసింది. ఇంటెన్స్, రా అండ్ రస్టిక్ యాక్షన్ సీక్వెన్సెస్ తో తాజాగా విడుదల చేసిన టీజర్ ఆడియన్స్ కు మైండ్ బ్లోయింగ్ చేస్తుంది.
స్టార్ హీరోయిన్ అమలా పాల్ ఈ సినిమాలో ప్రత్యేకపాత్రలో నటిస్తుంది. అజయ్ దేవగణ్ ఫిలిమ్స్, డ్రీం వారియర్ పిక్చర్స్, టి సిరీస్ , రిలియన్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ సంయుక్త నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమా మార్చ్ 30, 2023లో విడుదల కాబోతుంది.