'మసూద' సినిమాతో బ్లాక్ బెస్టర్ హిట్ అందుకున్న తిరువీర్ రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం "పరేషాన్". పావని కరణం హీరోయిన్ గా నటిస్తుంది. రూపక్ రొనాల్డ్సన్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. వాల్టాయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సిద్దార్థ్ రాళ్ళపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాకు యశ్వంత్ నాగ్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు 'ముసిముసి నవ్వుల' లిరికల్ వీడియోను విడుదల చేసేందుకు మేకర్స్ రంగం సిద్ధం చేసారు. విశేషమేంటంటే, ఈ పాటను విలక్షణ నటుడు సత్యదేవ్ లాంచ్ చెయ్యనున్నారు.