'లండన్ బాబులు' చిత్రంతో వెండితెర అరంగేట్రం చేసిన హీరో రక్షిత్ అట్లూరి ఆపై 2020లో 'పలాస 1978' సినిమాలో హీరోగా నటించారు. కరుణ కుమార్ దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమా విమర్శకుల ప్రసంశలు అందుకుంది.
ఆ సినిమా తదుపరి రక్షిత్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ కాసేపటి క్రితమే మేకర్స్ ఎనౌన్స్ చెయ్యడం జరిగింది. 'మీ ఆలోచనలే మీ శత్రువులు' పేరుతో ఒక స్పెషల్ పోస్టర్ విడుదలైంది. ఈ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ జనవరి 26 ఉదయం 11: 15 నిమిషాలకు రివీల్ చెయ్యబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. పలాస 1978 నిర్మించిన సుధాస్ మీడియా సంస్థలో ప్రొడక్షన్ నెంబర్ 2 గా ఈ సినిమా తెరకెక్కబోతుంది.