నాలుగేళ్ళ విరామం తదుపరి బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ "పఠాన్" సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. సిద్దార్ధ్ ఆనంద్ డైరెక్షన్లో స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తుంది. జాన్ అబ్రహం విలన్ రోల్ లో నటిస్తున్నారు.
హిందీ తో పాటుగా తెలుగు, తమిళ భాషలలో రేపు గ్రాండ్ గా విడుదల కాబోతున్న పఠాన్ అడ్వాన్స్ బుకింగ్స్ తో సృష్టిస్తున్న సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ఈ సినిమా వస్తుందని తెలియడం, అడ్వాన్స్ బుకింగ్స్ తో చేస్తున్న హంగామా కారణంగా పాండెమిక్ లో మూతపడిన థియేటర్లు తిరిగి ఓపెన్ అవుతున్నాయట. తాజా సమాచారం ప్రకారం, పఠాన్ మూవీ 100కి పైగా దేశాలలో 2500కి పైగా స్క్రీన్స్ లో ప్రదర్శింపబడబోతుందని తెలుస్తుంది. పోస్ట్ పాండెమిక్ లో ఈ రేంజ్ లో రిలీజ్ కాబోతున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం.