నటసింహంనందమూరి బాలకృష్ణ గారు ఇటీవల హైదరాబాద్ లో జరిగిన "వీరసింహారెడ్డి" విజయోత్సవ వేడుకలలో చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో అగ్గిని రాజేస్తున్నాయి. లెజెండరీ నటులు SV రంగారావు, అక్కినేని నాగేశ్వరరావు గార్ల మీద బాలయ్య కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసారు. కొంతమంది ప్రేక్షకాభిమానులు తమ అభిమాన నటులను బాలయ్య తన వ్యాఖ్యలతో అవమానించారని, సోషల్ మీడియాలో ఘాటుగా విమర్శిస్తున్నారు.
తాజాగా బాలయ్య వ్యాఖ్యలపై అక్కినేని యంగ్ హీరోలు నాగచైతన్య, అఖిల్ ట్విట్టర్ వేదికగా స్పందించడం జరిగింది. నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, SV రంగారావు గారు తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డలు. వారిని అగౌరవపరచటం ...మనల్ని మనమే కించపరుచుకోవడం.. అని పేర్కొంటూ చైతూ, అఖిల్ జాయింట్ స్టేట్మెంట్ విడుదల చేసారు.