సంక్రాంతి కానుకగా కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ నుండి 'వారిసు / వారసుడు' విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. తదుపరి విజయ్ కోలీవుడ్ సెన్సేషన్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో ఒక సినిమా చేసేందుకు సైన్ చేసిన విషయం తెలిసిందే. చడీచప్పుడు లేకుండా రీసెంట్గానే పూజాకార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమై, రెగ్యులర్ షూటింగ్ షురూ చేసిన ఈ సినిమా యొక్క అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రిపబ్లిక్ డే రోజున ఉండబోతుందని తాజా సమాచారం.
ఈ విషయం పక్కన పెడితే, తాజా బజ్ ప్రకారం ఈ సినిమాలో విశ్వనటుడు కమల్ హాసన్ గారు స్పెషల్ రోల్ లో మెరవబోతున్నారని టాక్ నడుస్తుంది. కమల్ - లోకేష్ కలయికలో రీసెంట్గా వచ్చిన బ్లాక్ బస్టర్ "విక్రమ్" లో క్లైమాక్స్ లో వచ్చే రోలెక్స్ పాత్ర సినిమాకే మెయిన్ హైలైట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే విధంగా, తలపతి 67లో కమల్ పాత్ర ఉండబోతుందని వినికిడి.