మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన "వాల్తేరు వీరయ్య" సంక్రాంతి కానుకగా ధియేటర్లకొచ్చి, అశేష ప్రేక్షకాభిమానుల నీరాజనాలు అందుకుంటున్న విషయం తెలిసిందే. రెండో వారంలో కూడా బాక్సాఫీస్ వద్ద మెగా మాస్ కలెక్షన్లను రాబడుతున్న ఈ సినిమా రీసెంట్గానే 100కోట్ల షేర్ ను రాబట్టింది. ఈ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్లో చిరు ఖాతాలో మూడవ 100కోట్ల షేర్ సినిమా వచ్చి చేరినట్టయ్యింది. డైరెక్టర్ బాబీ రూపొందించిన ఈ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్లో మాస్ రాజా రవితేజ క్రూషియల్ రోల్ లో నటించారు.
తాజాగా 'వీరయ్య విజయ విహారం' పేరిట మేకర్స్ వాల్తేరు వీరయ్య మెగా మాస్ సక్సెస్ సెలెబ్రేషన్స్ ను నిర్వహించడానికి వేదిక సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ఈనెల 28వ తేదీన యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ, సుబేదారి, హన్మకొండలో వీరయ్య విజయ విహారం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించబోతున్నట్టు కాసేపటి క్రితమే మేకర్స్ అఫీషియల్ పోస్టర్ విడుదల చేసారు.