టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి నటసింహ నందమూరి బాలకృష్ణతో ఒక సినిమా చేస్తున్నట్లు అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ కాంబినేషన్ లో రానున్న సినిమా కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజగా ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ బిగ్గీలో మహిళా ప్రధాన పాత్రకు కాజల్ అగర్వాల్‌ను ఎంపిక చేయటానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి ఈ విషయం గురించి ఏదీ ఖచ్చితంగా తెలియలేదు రానున్న రోజులలో మేకర్స్ వెల్లడిచేయనున్నారు. NBK108ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి మరియు హరీష్ పెద్ది భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందించనున్నారు.