బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్, గ్లామరస్ బ్యూటీ దీపికా పదుకొణె జంటగా నటిస్తున్న నాల్గవ చిత్రం "పఠాన్". సిద్దార్థ్ ఆనంద్ డైరెక్షన్లో ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో జాన్ అబ్రహం విలన్గా నటిస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళ భాషలలో ఈ రోజే పఠాన్ ప్రేక్షకులను పలకరించడానికి థియేటర్లకు వచ్చాడు.
విడుదలకు ముందు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా సెన్సేషన్ సృష్టించిన పఠాన్ ఇక ఫస్ట్ డే కలెక్షన్స్ లో పాత రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తుంది. పోతే, తాజాగా పఠాన్ డిజిటల్ స్ట్రీమింగ్ పార్టనర్ పై అఫీషియల్ క్లారిటీ వస్తుంది. ఈమేరకు అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ పఠాన్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుందని, ఫ్యూచర్ లో సదరు డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లోనే పఠాన్ పోస్ట్ థియేట్రికల్ ఎంట్రీ ఉంటుందని తెలుస్తుంది.