ఎలాంటి సపోర్ట్, బ్యాక్ గ్రౌండ్ లేనివాళ్లు కూడా సినీ ఇండస్ట్రీలోకి రావచ్చు, స్టార్ హీరోగా మారొచ్చు.. అని నిరూపించిన అతి కొద్దిమంది హీరోలలో మాస్ రాజా రవితేజ ఒకరు.1968, జనవారి 6న భూపతిరాజు రవిశంకర్ రాజు గా జన్మించి, సినీ ఇండస్ట్రీలో రవితేజగా పునర్జన్మించి, ఆపై మాస్ రాజాగా, మాస్ మహారాజాగా తెలుగు ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.
ఈ రోజు 55వ పుట్టినరోజును జరుపుకుంటున్న రవితేజకు ఈ పుట్టినరోజు ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే, ఆయన నటించిన ధమాకా, వాల్తేరు వీరయ్య.. రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చిన ఈ పుట్టినరోజును రవితేజ అండ్ ఫ్యాన్స్ విజయోత్సాహంలో గ్రాండ్ గా జరుపుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు అభిమానులు. హ్యాపీ బర్త్ డే రవితేజ గారు.!!