అఖిల్ అక్కినేని, కొత్తమ్మాయి సాక్షి వైద్య జంటగా నటిస్తున్న చిత్రం "ఏజెంట్". సురేందర్ రెడ్డి డైరెక్షన్లో స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీరోల్ లో నటిస్తున్నారు.
మెగాస్టార్ వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలకు పోటీగా ఈ సంక్రాంతి బరిలో దిగాల్సిన ఏజెంట్ ఇంకా షూటింగ్ పూర్తి కాకపోవడంతో వెనుదిరిగాడు. ఏజెంట్ టీజర్ సృష్టించిన సెన్సేషన్ తో ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదలవుతుందా అని ప్రేక్షకాభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తుంటే, చిత్రబృందం నుండి మాత్రం ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.
ఐతే, తాజా సమాచారం ప్రకారం, ఏజెంట్ మూవీ ఏప్రిల్ 14న పాన్ ఇండియా భాషల్లో విడుదల కావడానికి రెడీ అవుతుందని టాక్ నడుస్తుంది. అతి త్వరలోనే ఈ విషయంపై మేకర్స్ నుండి అఫీషియల్ క్లారిటీ కూడా రాబోతుందంట.