స్వరవాణి కీరవాణికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ప్రతి ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం భారతదేశ అత్యున్నత పురస్కారాలను ప్రకటించింది. ఇరు తెలుగు రాష్ట్రాల నుండి మొత్తంగా 12 మంది పద్మ అవార్డులకు ఎంపికయ్యారు.
అంతర్జాతీయ స్థాయిలో RRR సినిమాతో కీరవాణి గారు తన ప్రతిభను చాటుకోవడం, సినీ రంగానికి సంగీత సేవ చేసినందుకు గానూ కీరవాణికి ఈ పురస్కారం దక్కినట్టు తెలుస్తుంది. పోతే, RRR లోని నాటు నాటు పాటకు గానూ కీరవాణి పలు అంతర్జాతీయ అవార్డులను అందుకున్న విషయం తెలిసిందే. ప్రఖ్యాత గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకున్న కీరవాణి ప్రస్తుతం ఆస్కార్ నామినేషన్ అందుకుని, అతి త్వరలోనే భారతీయులు గర్వపడే బహుమానాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నారు.