మాస్ రాజా రవితేజ ఈ రోజు 55వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రవితేజ నటిస్తున్న "రావణాసుర" చిత్రం నుండి కాసేపటి క్రితమే మేకర్స్ న్యూ గ్లిమ్స్ వీడియోను విడుదల చేసారు.
హీరోస్ డోంట్ ఎక్సిస్ట్ ... థీమ్ తో విడుదలైన ఈ గ్లిమ్స్ వీడియోను బట్టి రవితేజ ను ఒక పవర్ఫుల్ విలన్ రోల్ లో అతి త్వరలోనే చూడొచ్చు అని తెలుస్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకునేలా ఉంది.
క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరిస్తుండగా, సుశాంత్ విలన్గా నటిస్తున్నారు. అను ఇమ్మాన్యూల్
హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్ కీరోల్స్ లో నటిస్తున్నారు. ఏప్రిల్ 7వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతుంది.