ఛే నాగ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం "పర్ఫ్యూమ్". ఇందులో ప్రాచి ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఫ్రాగ్రాన్స్ మానిఫెస్టేషన్ బ్యానర్ పై జె సుధాకర్, శివ బి, రాజ్ కుమార్, శ్రీనివాస్, రాజేందర్, శ్రీధర్ నిర్మిస్తున్నారు. జేడీ స్వామి డైరెక్షన్లో విభిన్నమైన పాయింట్ తో, సైకలాజికల్ రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీకి అజయ్ అరసద సంగీతం అందిస్తున్నారు. తాజాగా పర్ఫ్యూమ్ సినిమా నుండి 'ఏవి ఏవి ఎక్కట్టేదు' లిరికల్ వీడియో విడుదలైంది. ఈపాటను పృథ్వి చంద్ర ఆలపించగా, గోల్డెన్ గ్లోబ్ అవార్డు విన్నర్ చంద్రబోస్ గారు సాహిత్యం అందించారు.