ఇండియన్ క్రికెట్లో మిస్టర్ కూల్ గా పేరు తెచ్చుకుని, దేశానికి ఎన్నో ఘనమైన విజయాలను అందించిన మాజీ టీమిండియా క్యాప్టెన్ మహేంద్రసింగ్ ధోని "ధోని ఎంటర్టైన్మెంట్స్" బ్యానర్ ద్వారా సినిమా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టబోతున్న విషయం తెలిసిందే.
తాజాగా ఈ నిర్మాణ సంస్థలో తెరకెక్కబోయే ఫస్ట్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఎనౌన్స్మెంట్ కి మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేసారు. ఈ మేరకు రేపు ఉదయం 12:00 గంటలకు ధోని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఫస్ట్ ప్రాజెక్ట్ గా తెరకెక్కబోయే మూవీ టైటిల్ అండ్ క్యాస్ట్ ఎనౌన్స్మెంట్ జరగనుంది.
అప్పట్లో ధోని నిర్మించబోయే సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పోషిస్తుందని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే కదా. మరి ఈ విషయం పై క్లారిటీ రావలసి ఉంది.