సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'పఠాన్' సినిమా హిందీ, తెలుగు మరియు తమిళంలో విడుదలైయింది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ KGF 2 యొక్క ఓపెనింగ్ కలెక్షన్‌లను క్రాస్ చేసి హైయెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా యొక్క హిందీ వెర్షన్ విడుదలైన మొదటి రోజున 55 కోట్లు వసూలు చేసింది. KGF 2 (53.95 కోట్లు), వార్ (51.6 కోట్లు), మరియు థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ (50.75 కోట్లు) ఇప్పుడు రెండవ, మూడవ మరియు నాల్గవ స్థానాలను ఆక్రమించాయి.
ఈ చిత్రం రానున్న రెండు రోజుల్లోనే 100 కోట్ల మార్కును అధిగమించి అలా చేసిన మొదటి హిందీ చిత్రంగా నిలుస్తుంది అని ట్రేడ్ పండిట్స్ అంచనా వేస్తున్నారు. ఈ చిత్రంలో బ్యూటీ క్వీన్ దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తుంది. హ్యాండ్సమ్ హంక్ జాన్ అబ్రహం ఈ బిగ్గీలో కీలక పాత్రలో కనిపించనున్నారు. యష్ రాజ్ ఫిల్మ్స్ ఈ సినిమాని నిర్మించింది.
![]() |
![]() |