నటసింహం నందమూరి బాలకృష్ణ గారు ఇటీవల హైదరాబాద్ లో జరిగిన "వీరసింహారెడ్డి" విజయోత్సవ వేడుకలలో, లెజెండరీ నటులు SV రంగారావు, అక్కినేని నాగేశ్వరరావు గార్ల మీద చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో అగ్గిని రాజేస్తున్నాయి. కొంతమంది ప్రేక్షకాభిమానులు తమ అభిమాన నటులను బాలయ్య తన వ్యాఖ్యలతో అవమానించారని, సోషల్ మీడియాలో ఘాటుగా విమర్శిస్తున్నారు. ఆల్రెడీ బాలయ్య వ్యాఖ్యలను ఖండిస్తూ అక్కినేని కుటుంబం తరఫు నుండి నాగచైతన్య, అఖిల్ ట్విట్టర్ వేదికగా స్పందించగా, బాలయ్య వ్యాఖ్యలలో తమకెలాంటి కాంట్రవర్సీ కనిపించడం లేదని SV రంగారావు గారి మనవళ్లు వీడియో రూపంలో క్లారిటీ ఇచ్చారు.
తాజాగా ఈ కాంట్రవర్సీ పై బాలయ్య స్పందించారు. నాగేశ్వరరావు గారు తనకు బాబాయ్ లాంటి వారని, ఆయనంటే తనకు చాలా గౌరవమని, ఆయన కూడా తనను ఎంతో ఆప్యాయంగా పలకరించేవారని, ఎందుకంటే, అక్కడ లేని ఆప్యాయత ఇక్కడ ఉంది కాబట్టి ..గుర్తు పెట్టుకోండంటూ .. కాంట్రవర్సీపై క్లారిటీ ఇస్తూనే మరొక కాంట్రవర్సీకి తెరతీశారు.
![]() |
![]() |