కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన తదుపరి సినిమాని దర్శకుడు సిరుత్తై శివతో అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి టెంపరరీగా 'సూర్య 42' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. 2 భాగాలుగా రూపొందనున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ క్వీన్ దిశా పటానీ సూర్య సరసన జోడిగా నటిస్తుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది అని సమాచారం. ఈ షెడ్యూల్‌లో నిర్మాతలు సూర్య మరియు ఇతరులపై పీరియడ్ పోర్షన్స్‌ను క్యానింగ్ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.
తాజాగా చెన్నైలోని ఎన్నూర్ పోర్ట్ మరియు EVP ఫిల్మ్ సిటీలో మూవీ మేకర్స్ ముఖ్యమైన సన్నివేశాలను రూపొందించారు. ఇటీవలే ఈ షెడ్యూల్ పూర్తి చేసుకుని తదుపరి షెడ్యూల్‌కి సిద్ధమవుతున్నారు. మార్చి లేదా ఏప్రిల్ నాటికి ఈ పీరియడ్ డ్రామా షూటింగ్ ని ముగించటానికి ప్లాన్ చేస్తున్నట్లు లేటెస్ట్ టాక్.
ఈ మాస్ ఎంటర్‌టైనర్‌కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా 10 భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ బ్యానర్లపై వంశీకృష్ణ, ప్రమోద్, కెఇ జ్ఞానవేల్రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.