గతేడాది "యశోద" పాన్ ఇండియా హిట్ కొట్టి, తిరిగి ఈ ఏడాది "శాకుంతలం" తో మరొక పాన్ ఇండియా హిట్ ను తన ఖాతాలో వేసుకునేందుకు సిద్ధమవుతుంది క్రేజీ హీరోయిన్ సమంత.
సినిమాల విషయం పక్కన పెడితే, సమంత ఫిట్నెస్ ఫ్రీక్ అన్న విషయం అందరికి తెలిసిందే. సమయం దొరికితే, జిమ్ లో కఠిన కసరత్తులు చేస్తూ, వాటిని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసే సమంత కొన్నాళ్లుగా ఎలాంటి జిమ్ వర్కౌట్ వీడియోలను పోస్ట్ చెయ్యట్లేదు. ఎందుకంటే, ఆమె మాయోసైటిస్ వ్యాధికి చికిత్స తీసుకుంటుంది కాబట్టి.
మాయోసైటిస్ నుండి ఈమధ్యనే సంపూర్ణంగా కోలుకున్న సమంత తాజాగా తిరిగి తన వ్యాపకాన్ని మొదలెట్టేసింది. జిమ్ లో హెవీ వర్కౌట్స్ చేస్తున్న వీడియోను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.