యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న న్యూ మూవీ "వినరో భాగ్యము విష్ణుకథ". ఈ సినిమాకు మురళి కిషోర్ అబ్బూరు డైరెక్టర్ గా వ్యవహరిస్తుండగా, కాశ్మీర పరదేశి హీరోయిన్ గా నటిస్తుంది. GA 2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తుండగా, అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు.
గతకొన్ని రోజుల నుండి VBVK ప్రమోషన్స్ నిమిత్తం ఊరు ఊరు తిరిగిన చిత్రబృందం ఇటీవలే VVIT కాలేజీ, గుంటూరు క్రికెట్ టీం తో ఒక మ్యాచ్ కూడా ఆడింది. తాజాగా కిరణ్ అబ్బవరం వరంగల్లో బ్రేకప్ పార్టీని నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. జనవరి 29వ తేదీ సాయంత్రం ఆరు గంటల నుండి వరంగల్, గొర్రెకుంట, కే స్ట్రీట్ డ్రైవ్ ఇన్ లో కిరణ్ అబ్బవరం బ్రేకప్ పార్టీ జరగబోతుందని కాసేపటి క్రితమే మేకర్స్ స్పెషల్ పోస్టర్ తో ఎనౌన్స్ చేసారు.
పోతే, ఈ మూవీ మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 17న విడుదల కాబోతుంది.