మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన న్యూ మూవీ "వాల్తేరు వీరయ్య". బాబీ కొల్లి డైరెక్షన్లో కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో మాస్ రాజా రవితేజ కీరోల్ చేసారు. శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించింది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
సంక్రాంతి కానుకగా థియేటర్లకొచ్చిన వీరయ్యకు ఆడియన్స్ బ్రహ్మరధం పడుతున్నారు. ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఓవర్సీస్ లోనూ హౌస్ ఫుల్ థియేటర్ రన్ జరుపుకుంటున్న ఈ సినిమా రీసెంట్గానే 100కోట్ల షేర్ అందుకుంది. USA బాక్సాఫీస్ వద్ద ఆరు రోజుల్లో రికార్డు బ్రేకింగ్ రీతిలో 2మిలియన్ డాలర్లను వసూలు చేసిన వీరయ్య తాజాగా USA లో 2.3 మిలియన్ డాలర్లను కలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది.