దుల్కర్ సల్మాన్, కాజల్ అగర్వాల్, అదితి రావ్ హైదరి ముఖ్యపాత్రలు పోషించిన "హే సినామిక" సినిమాతో కొరియోగ్రాఫర్ నుండి దర్శకురాలిగా మారారు బృందా గోపాల్. తాజాగా ఆమె దర్శకత్వం వహిస్తున్న సినిమా "థగ్స్". తెలుగులో 'కోనసీమ థగ్స్' పేరుతో విడుదల కాబోతుంది.
పోతే, ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు కోనసీమ థగ్స్ ట్రైలర్ విడుదల కాబోతుంది. ఈ ట్రైలర్ ను ప్రముఖ సినీ తారలు కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్, విజయ్ సేతుపతి, ఆర్య, కంపోజర్ అనిరుధ్ రవిచంద్రన్ విడుదల చెయ్యబోతున్నారు.
బాబీ సింహ, RK సురేష్, మునిష్కంత్, శరత్ అప్పాని, అనశ్వర్ రాజన్ ముఖ్య తారాగణంగా నటిస్తున్న ఈ సినిమాతో హ్రిదు హరూన్ హీరోగా పరిచయమవుతున్నారు.