గతేడాదిలోనే కాక ఈ ఏడాది కూడా టాలీవుడ్ లో వరస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని రోజుల క్రితమే యువనటుడు సుధీర్ వర్మ సూసైడ్ చేసుకున్నాడనే వార్త టాలీవుడ్ ని కుదిపేసింది. ఈ రోజు సీనియర్ లెజెండరీ నటీమణి జమున గారు తుది శ్వాస విడిచారన్న విషయాన్ని టాలీవుడ్ ఆడియన్స్ ఇంకా జీర్ణించుకోలేకపోతున్న సమయంలోనే మరొక విషాదవార్త తెరమీదికి వచ్చి, బాధను రెట్టింపు చేస్తుంది.
ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి గారు ఈ రోజు ఉదయం ఎనిమిదిన్నర గంటలకు చెన్నైలోని స్వగృహంలో తుది శ్వాస విడిచారు. మరణానికి గుండెపోటు కారణమని తెలుస్తుంది. సూర్య, అజిత్, విక్రమ్, మోహన్ లాల్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి బిగ్ స్టార్స్ కు శ్రీనివాస మూర్తి గారు గాత్రదానం చేసారు.