చైల్డ్ ఆర్టిస్ట్ అనిఖా సురేంద్రన్ లీడ్ హీరోయిన్ గా డిబట్ ఎంట్రీ ఇస్తున్న చిత్రం "బుట్టబొమ్మ". అర్జున్ రామ్ దాస్, సూర్య వసిష్ఠ మేల్ లీడ్స్ లో నటిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శౌరీ చంద్రశేఖర్ టి రమేష్ డైరెక్ట్ చేస్తున్నారు.
వచ్చే నెల నాల్గవ తేదీన థియేటర్లకు రాబోతున్న ఈ సినిమా నుండి మేకర్స్ ట్రైలర్ రిలీజ్ టైం ను ఫిక్స్ చేస్తూ కాసేపటి క్రితమే అఫీషియల్ పోస్టర్ విడుదల చేసారు. ఈ మేరకు రేపు ఉదయం 11:07 నిమిషాలకు మాస్ కా దాస్ విశ్వక్ సేన్ బుట్టబొమ్మ ట్రైలర్ ను లాంచ్ చేయనున్నారని తెలుస్తుంది.